తెలంగాణ ఉద్యమకారులకు అవమానం!

by GSrikanth |
తెలంగాణ ఉద్యమకారులకు అవమానం!
X

దిశ, మహబూబాబాద్ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లాలో తెలంగాణ ఉద్యమకారులు ప్రభుత్వంపై తమ నిరసన గళాన్ని వినిపించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్‌లో ప్లకార్డులు చేతపట్టుకొని నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటై పదేళ్లు గడుస్తున్నా తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పలువురు ఉద్యమ నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో వయస్సు, చదువు, సమయాన్ని వృథా చేసుకొని రోడ్డునపడ్డ ఉద్యమ కారులు ఉన్నారని అన్నారు. ప్రతి తెలంగాణ ఉద్యమకారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని, అర్హులైన వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణలో అవమానాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

Advertisement

Next Story