- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
టెస్కో ఎండీగా బాధ్యతలు స్వీకరించిన శైలజ రామయ్యార్
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర చేనేత జౌళిశాఖ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం చేనేత, జౌళి శాఖ సంచాలకులుగా, టెస్కో వీసీ మరియు ఎండీగా శైలజ రామయ్యర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా చేనేత, పవర్లూమ్ సహకార సంఘాల ప్రతినిధులు, సభ్యులు, చేనేత కళాకారులు, చేనేత జౌళి శాఖ ఉద్యోగులు, టెస్కో ఉద్యోగులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ చేనేత, జౌళి శాఖ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కేటీ చారి మాట్లాడుతూ.. చేనేత రంగంలో శైలజరామయ్యార్కు అపార అనుభవం కలిగి చేనేత కార్మికులు, చేనేత రంగంపై పూర్తి అవగాహన ఉందన్నారు. సమస్యలను పరిష్కరించి చేనేత రంగాన్ని ముందుకు తీసుకెళ్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉద్యోగులు సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ విజయ్ కుమార్, గౌరవాధ్యక్షుడు రవీంద్ర, ఉద్యోగులు పాల్గొన్నారు.