రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం వాళ్లే!

by GSrikanth |   ( Updated:2023-05-25 15:48:59.0  )
రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం వాళ్లే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ విద్యాసంస్థలను రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.ఎల్. మూర్తి, టి.నాగరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం వెలువడిన ఎంసెట్ ఫలితాలు వల్ల శ్రీచైతన్య డీడీ కాలనీ బ్రాంచ్‌లో చదువుతున్న విద్యార్థికి ర్యాంకు తక్కువగా రావడం వల్ల మనస్థాపానికి గురై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేసుకున్నారని పేర్కొన్నారు.

ఈ ఘటనకు కార్పొరేట్ కళాశాలల ర్యాంకులు, మార్కుల దాహామే, తక్కువ ర్యాంకులు, మార్కులు అసమానతలు వల్ల విద్యార్థులు మార్కులు, ర్యాంకులు సాధించకపోతే జీవితం వృథా అనే భ్రమలు కల్పిస్తున్నాయని తెలిపారు. ఈ కార్పొరేట్ విద్యాసంస్థలను రద్దు చేయకుంటే విద్యావ్యవస్థ మరింత సంక్షోభంలోకి వెళ్తుందని ప్రభుత్వానికి సూచించారు. కార్పొరేట్ విద్యాసంస్థల ర్యాంకుల దాహానికి ఇంకా ఎంత మంది విద్యార్థి బలి కావాలని ప్రశ్నించారు. ఆత్మహత్యాయత్నం చేసిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు మార్కులు, ర్యాంకులే జీవితం కాదని, ఎవరూ అధైర్య పడకుండా జీవితాన్ని మధ్యలో నష్టపోకుండా ఉండాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed