నారాయణ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.. ఎస్ఎఫ్ఐ డిమాండ్

by Javid Pasha |
నారాయణ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.. ఎస్ఎఫ్ఐ డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : నారాయణ మాదాపూర్ బ్రాంచ్ లో ఆత్మహత్య చేసుకోని చనిపోయిన కనకరాజు కుటుంబాన్ని ఆదుకోవాలని, అలాగే నారాయణ యాజమాన్యం పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎల్.మూర్తి శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేసారు. విద్యాసంవత్సరం ప్రారంభమైన తర్వాత కార్పొరేట్ విద్యాసంస్థలలో ఇది ఐదో విద్యార్ధి ఆత్మహత్య కాగా నారాయణ విద్యాసంస్థలో ఇది రెండవ ఆత్మహత్య అని పేర్కొన్నారు. ప్రభుత్వం గాని, ఇంటర్ విద్యాశాఖ అధికారులు కానీ పర్యవేక్షణ లేదని తెలిపారు.

ఇండ్లకు వెళ్ళి వచ్చిన వెంటనే ఫీజులు కోసం తీవ్రంగా వేధింపులు గురి చేస్తున్నారని అమాయక విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారని తక్షణమే నారాయణ యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేసారు. కళాశాలల ప్రారంభం కాకముందే ప్రతి కళాశాలలో కౌన్సిలింగ్ కోసం కౌన్సిలర్లను నియమించాలని మీటింగ్ పెట్టి మరి హెచ్చరించిన కార్పోరేట్ కళాశాలలు పాటించడం లేదన్నారు. భవిష్యత్ లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోకుండా యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అయన డిమాండ్ చేసారు.

Advertisement

Next Story