హెచ్‌సీయూ విద్యార్థి ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఏ, డీఎస్ యూ కూటమి విజయం

by Javid Pasha |   ( Updated:2023-02-25 17:34:16.0  )
హెచ్‌సీయూ విద్యార్థి ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఏ, డీఎస్ యూ కూటమి విజయం
X

దిశ, తెలంగాణ బ్యూరో : హెచ్‌సీయూ విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఐ, ఏఎస్ఏ, డీఎస్ యూ విద్యార్థి సంఘాల కూటమి విజయ కేతనం ఎగురవేసింది. శుక్రవారం ఎన్నికలు నిర్వహించారు. శనివారం రాత్రి వరకు కౌంటింగ్ నిర్వహించారు. ఉత్కంఠ భరిత ఈ ఎన్నికల్లో అన్ని స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. హెచ్‌సీయూ ప్రెసిడెంట్ ప్రజ్వల్ (ఏఎస్ఏ), జనరల్ సెక్రటరీగా కృప మరియా జార్జ్ (ఎస్‌ఎఫ్‌ఐ), వైస్ ప్రెసిడెంట్ సాయి పృధ్వీ (ఏఎస్ఏ), జాయింట్ సెక్రటరీ కత్తి గణేష్ (డీఎస్ యూ), కల్చరల్ సెక్రటరీ లిఖిత్ కుమార్ (ఎస్‌ఎఫ్‌ఐ), స్పోర్ట్స్ సెక్రటరీ సిహెచ్.జయరాజ్ (డీఎస్ యూ), జీఎస్ క్యాస్ (ఇంటిగ్రేటెడ్) షిఫా మింజ్ (ఎస్‌ఎఫ్‌ఐ), జిఎస్ క్యాస్ (పిజీ) హృతిక్ లక్ష్మణ్ లలన్(ఏఎస్ఏ), జిఎస్ క్యాస్( రిసెర్చ్) ఎస్.ఎస్. సుభాషిణి(ఎస్‌ఎఫ్‌ఐ)లు ఎన్నికల్లో విజయం సాధించారు. ఏబీవీపీ, ఏఎస్ డీ, వైఐఎస్ఎస్ ఓటమి చెందాయి.

Advertisement

Next Story