- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సేవాలాల్ మహారాజ్ గొప్ప సంఘ సంస్కర్త: మంత్రి సీతక్క
దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ సంత్ సేవాలాల్ మహారాజ్ గొప్ప సంఘ సంస్కర్తగా పని చేశారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. బుధవారం హైదారాబాద్ కొంపెల్లిలో సంత్ సేవాలాల్ మహారాజ్‌ను దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సేవాలాల్ మహారాజ్‌ను దైవంగా భావిస్తున్నారంటే ఆయన చేసిన బోధనలు, అనుసరించిన మార్గం ఎంత గొప్పదో అర్ధం చేసుకోవచ్చన్నారు. అహింసా మార్గాన్ని అవలంభించాలని, అనర్ధాలకు కారణమయ్యే మద్యపానానికి దూరంగా ఉండాలని, మహిళలను గౌరవించాలని సేవాలాల్ చేసిన బోధనలు ప్రతి ఒక్కరికి అనుసరణీయమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని అన్నారు. సామాజిక రుగ్మతలను పారద్రోలేందుకు సేవాలాల్ మహారాజ్ గొప్పతనం గురించి, ఆయన చేసిన బోధనలు భవిష్యత్ తరానికి సైతం అందేలా కృషి చేయాల్సిన బాధ్యతను గుర్తెరిగి ముందుకు సాగాలని మంత్రి సీతక్క సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌తో పాటు బంజారా నాయకులు పాల్గొన్నారు.