వికారాబాద్‌లో ఘోర ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

by GSrikanth |
వికారాబాద్‌లో ఘోర ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చిట్టెంపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగివున్న లారీని అతివేగంగా వచ్చిన ఓ బైకు వెనుకనుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. మృతులు హోటల్‌లో పనిచేసే శ్రీనివాస్, చందులుగా గుర్తించారు. మద్దూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed