- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ది కేరళ స్టోరీస్’ మూవీని తలపిస్తోన్న హైదరాబాద్ టెర్రర్ లింక్ కేస్.. దర్యాప్తులో సంచలన విషయాలు!
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ టెర్రర్ లింక్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారంతో తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్, మధ్యప్రదేశ్ ఏటీఎస్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టి మంగళవారం హైదరాబాద్‌లో ఐదుగురిని అరెస్ట్ చేశారు. నిందితులు షేక్ జునైద్, మహ్మద్ సలీం, అబ్దుల్ రెహ్మన్, అమీద్‌లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అయితే, పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది.
ఈ కేసు దర్యాప్తులో ఇటీవల దేశంలో సంచలనం సృష్టిస్తోన్న ‘‘ది కేరళ స్టోరీస్’’ సినిమాను తలపించే విషయాలు బయటపడ్డట్లు సమాచారం. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న సలీం.. గతంలో మత మార్పిడి చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. సలీం అసలు పేరు సౌరభ్‌రాజ్ కాగా.. మతం మార్చుకుని సలీం అని పేరు మార్చకున్నట్లు పోలీసులు కనుగొన్నారు. అంతేకాకుండా సలీం భార్య కూడా మతమార్పిడి చేసుకున్నట్లు వెల్లడించారు.
మరో నిందితుడు అబ్దుల్ రెహ్మాన్ అసలు పేరు దేవీప్రసాద్ పండా కాగా, మరో నిందితుడు అబ్బాస్ అలీ అసలు పేరు వేణుకుమార్‌గా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుల్లో ముగ్గురు హిందువులు కాగా.. ముస్లింలుగా మతం మారినట్లు పోలీసులు గుర్తించారు. సలీం ఇంట్లో జిహాదీ సాహిత్యం, జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఈ కేసులో ఇప్పుడు మతమార్పిడి అంశంగా కీలకంగా మారింది.