- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సాత్విక్‌ను చిత్రహింసలు పెట్టిన కాలేజీ సిబ్బంది.. రిమాండ్ రిపోర్ట్‌లో ఏం తేలిందంటే?
దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: నార్సింగిలోని శ్రీచైతన్య కాలేజీ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. కాలేజీ అధ్యాపకులు అతన్ని కులం పేరుతో నిత్యం దూషించినట్లు స్పష్టమైంది. పోలీసులు కోర్టుకు సమర్పించిన నిందితుల రిమాండ్ రిపోర్ట్‌లో ఈ విషయాలను పేర్కొన్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి అయిన సాత్విక్‌ను ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి, వార్డెన్ నరేష్, వైస్ ప్రిన్సిపాల్ జగన్ పగబట్టినట్టుగా శారీరక, మానసిక హింసలకు గురి చేసేవారు. అంతేగాక.. కులం పేరుతో దూషించటమే కాకుండా ‘ఆస్తులుంటే ఏం పీకుతావురా’ అంటూ పరుష పదజాలంతో తిట్టేవారు.
ఇక, వైస్ ప్రిన్సిపాల్ జగన్ మార్కులు తక్కువగా వస్తే బయట అయిదారు గంటలు నిలబెట్టేవాడు. వార్డెన్ నరేష్ అయితే సాత్విక్ స్నానం చేస్తుంటే నల్లా బంద్ చెయ్యటం, నీళ్లు తాగుతుంటే చేతిలోని బాటిల్ లాక్కొవటంతో పాటు బండ బూతులు తిట్టటం చేసేవాడు. సాత్విక్ ఆత్మహత్య చేసుకున్న రోజు ఉదయం అతని తల్లిదండ్రులు కాలేజీకి వచ్చి వెళ్లారు. వాళ్లు వెళ్లగానే ఆచార్య, కృష్ణారెడ్డిలు వారిని ఉద్దేశించి కూడా సాత్విక్ ముందు బూతులు తిట్టారు. ఈ వేధింపులు భరించలేకనే సాత్విక్ క్లాస్ రూంలోనే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.