తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

by Gantepaka Srikanth |   ( Updated:2024-07-31 14:58:16.0  )
TS High Court Asks Government to file Report on Right to Education
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువడించింది. బాలికపై అత్యాచారం కేసులో దోషికి ఉరి శిక్ష విధిస్తూ బుధవారం తీర్పు చెప్పింది. 2018లో నార్సింగిలో నాలుగున్నరేళ్ల బాలికపై దినేష్ అనే యువకుడు అతి దారుణంగా అత్యాచారం చేసి, ఆపై హత్య చేశాడు. ఈ కేసులో 2021లోనే రంగారెడ్డి కోర్టు దోషికి ఉరిశిక్ష విధించింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. ఇవాళ ఆ పిటిషన్‌పై విచారణ జరగ్గా.. రంగారెడ్డి కోర్టు తీర్పును రాష్ట్ర హైకోర్టు సమర్థించింది. కాగా, బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన యువకుడు సెంట్రింగ్ పనిచేసే కార్మికుడిగా పోలీసులు గుర్తించారు.

Read More..

judgment : అవినీతికి పాల్పడిన సీఐకి ఐదేళ్ల జైలు

Advertisement

Next Story