- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారీ విరాళాలు మూటకట్టుకున్న బీజేపీ.. ఏడీఆర్ రిపోర్టులో సంచలన విషయాలు
దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్రంలోని బీజేపీ పార్టీ విరాళాల సేకరణలో రికార్డులు తిరగరాస్తోంది. ఎన్నికల సంఘంలో నమోదైన జాతీయ, ప్రాంతీయ పార్టీల విరాళాలపై అధ్యయనం చేసిన ఏడీఆర్.. సోమవారం పూర్తి చిట్టాను రిలీజ్ చేసింది. ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా 2019-20 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్, వ్యాపార సంస్థల నుంచి రూ. 921.95 కోట్ల విరాళం దేశంలోని వివిధ జాతీయ పార్టీలకు అందాయి. ఇంత మొత్తంలో విరాళాలు రావడం ఇదే తొలిసారి. అయితే, ఇందులో కేవలం బీజేపీ పార్టీకి మాత్రమే రూ. 720 కోట్లు రాగా, మిగతా మొత్తం కాంగ్రెస్, ఎన్సీపీ, ఏఐటీసీ, సీపీఎం పార్టీలకు వచ్చినట్లు నివేదికలో వెల్లడించారు. ట్రస్ట్‌కు విరాళాలు పంపిన వారిలో తయారీ రంగానికి చెందిన కంపెనీలు, మైనింగ్, నిర్మాణం, ఎగుమతులు, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్‌కు చెందిన కంపెనీలు మాత్రమే అధికంగా ఉన్నాయి. అయితే, రూ.4,847 కోట్లతో అత్యధిక ఆస్తులు కలిగిన ధనిక పార్టీగా బీజేపీ నిలిచిందని 'ఏడీఆర్' రిపోర్ట్ గతంలోనే వెల్లడించగా.. విరాళాల్లోనూ ఏడాదికి వందల కోట్లతో దూసుకుపోతోంది. ఏడీఆర్ రిలీజ్ చేసిన నివేదిక ప్రకారం 2019-20లోని విరాళాల్లో సరైన అడ్రెస్ లేకుండా రూ.10 కోట్లు, అడ్రెస్, పాన్ వివరాలు ఇవ్వకుండా రూ.16 కోట్లు, పాన్ నెంబర్ ఇవ్వకుండా రూ.13 కోట్లు ఎలక్టోరల్ ట్రస్ట్‌కు అందాయి.