- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BJP MLA: మా ప్రాంతాన్ని మహారాష్ట్రలో కలపండి.. తెలంగాణ ఎమ్మెల్యే సంచలన డిమాండ్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. సిర్పూర్ ప్రాంతంపై ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. తమ ప్రాంతానికి(ఉత్తర తెలంగాణ) బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు లేవని ఆవేదన చెందారు. తమకు జీవన ప్రమాణాలు పెంచి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేకపోతే తమ నియోజకవర్గాన్ని మహారాష్ట్రలో కలపాలని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తర తెలంగాణ ప్రజల నోటికాడి ముద్దను లాక్కెళ్లారని మండిపడ్డారు.
దక్షిణ తెలంగాణలోని ప్రాజెక్టుల మీద ఉన్న శ్రద్ద ఉత్తర తెలంగాణ మీద కూడా చూపాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ మీద వివక్షే.. ఇప్పుడు ప్రత్యేక తెలంగాణలో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మీద కక్షకట్టారని సీరియస్ అయ్యారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ది కోసం హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టవచ్చు అన్నారు. ఈ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుందని చెప్పారు. అవసరమైతే బీజేపీ ఎమ్మెల్యేలు అందరం కలిసి వెళ్లి కేంద్రాన్ని ఒప్పిస్తామని స్పష్టం చేశారు.