- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తిరుమల దర్శనాలపై తెలంగాణ ఎమ్మెల్యేల సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: తిరుమల దర్శనా(Tirumala darshan)లపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి(Anirudh Reddy) సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఏపీకి మన ఆస్తులు కావాలి.. కానీ తిరుమలలో మనకు హక్కు లేదంట’ అని అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు తిరుమల ఆలయం తమిళనాడు ఆధీనంలో ఉండేదని గుర్తుచేశారు. పునర్విభజనలో భాగంగా తెలుగు మాట్లాడేవారి కోసం ఉమ్మడి రాష్ట్రానికి తిరుమలను కేటాయించారని అన్నారు. తిరుమలలో తమ ఎమ్మెల్యేల సిఫార్లు లేఖలను అనుమతించే వరకు ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు.
ఆస్తులు, వ్యాపారాల కోసం ఏపీ వాళ్లు తెలంగాణకు వస్తారు. కానీ, తమకు తిరుమలలో ప్రొటోకాల్ ఇవ్వరా? అని ప్రశ్నించారు. చంద్రబాబు తెలంగాణకు రావాల్సిన అవసరమే లేదు. దీనిపై ఎంతదూరమైనా వెళ్లి కొట్లాడుతామని అన్నారు. అనంతరం మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(Yennam Srinivas Reddy) మాట్లాడారు. తెలంగాణ ఎమ్మెల్యేలకు తిరుమలలో ఎందుకు ప్రొటోకాల్ ఇవ్వరో చెప్పాలని డిమాండ్ చేశారు. అనిరుధ్ రెడ్డికి తామంతా మద్దతుగా ఉంటామని అన్నారు. ఎమ్మెల్యేలందరినీ ఏకం చేసి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్తామని ప్రకటించారు. ఏపీ సీఎం చంద్రబాబు తమ మాట వినేలా ఒత్తిడి తీసుకొస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు.