- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుపై MP లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలో ఎన్‌డీఏ కూటమి ఓటమే లక్ష్యంగా విపక్షాలు ఏర్పాటు చేసుకున్న ఇండియా కూటమిపై తెలంగాణ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌తో విసిగిపోయి కూటమి పార్టీలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని అన్నారు. ఎన్నికల వేళ మునిగిపోయే నావ అయినటువంటి కాంగ్రెస్‌తో కలిసి ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదనే క్లారిటీతో అంతా మెల్లగా కూటమి నుంచి బయటకు వస్తున్నారని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌ది గాలివాటం గెలుపు అని సెటైర్లు వేశారు. మోసపూరిత హామీలు గుప్పించి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.
ఇప్పుడు ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్, కేసులు, చేసిన అవినీతి నుంచి తప్పించుకునేందుకు బీఆర్ఎస్ రహస్య ఒప్పందంతో ముందుకు వెళుతున్నాయని అన్నారు. ఎవరేం చేసినా.. ఎన్ని కుట్రలు పన్నినా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీదే గెలుపని జోస్యం చెప్పారు. తెలంగాణలోనూ పార్లమెంట్ ఎన్నికల్లో 10 సీట్లకు తగ్గకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. పది సీట్లు గెలవడంతో పాటు మొత్తం 17 స్థానాల్లో గట్టి పోటీ ఇస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని చెప్పారు. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ పనిఅయిపోయినట్లే అని అన్నారు. తాము బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోవడం ఎప్పటికీ జరుగదని అన్నారు. కాళ్ల బేరానికి వచ్చినా పొత్తు నో అంటామని చెప్పారు. రేపటినుంచి రాష్ట్రంలో బీజేపీ బస్సు యాత్రలు ప్రారంభమవుతాయని తెలిపారు.