పసుపు బోర్డుపై MLC Kavitha సంచలన వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   ( Updated:2022-12-13 09:13:04.0  )
పసుపు బోర్డుపై MLC Kavitha సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: పసుపు బోర్డుపై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు పసుపు బోర్డు రాకపోవడానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కారణమని కవిత అన్నారు. అభివృద్ధిపై బీజేపీని కౌంటర్ చేస్తామన్నారు. హిందీ భాషపై కాదు.. బలహీన పడుతున్న రుపాయి విలువపై మాట్లాడాలని కవిత కేంద్రానికి సూచించారు. తెలంగాణలో షర్మిల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. బండి సంజయ్ పదజాలం అవమానకరంగా ఉందన్నారు. తనపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు బాధగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలు సరైన సమయంలో బీజేపీని తిప్పికొడతారని తెలిపారు. భారత్ జాగృతి ఎప్పుడో రిజిస్టర్ అయిందని దాని కార్యక్రమాలలో వేగం పెంచుతామన్నారు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మానస పుత్రిక అని ఆ పార్టీలో ఏ పాత్ర ఇచ్చిన పోషిస్తానని కవిత అన్నారు. జాతీయ ప్రత్యామ్నాయంగా మా పార్టీ ఉండబోతోందన్నారు. ప్రతి రాష్ట్రంలో జాగృతి కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. తెలంగాణలో లాగే ఆయా రాష్ట్రాల సంస్కృతులను జాగృతి ద్వారా గౌరవిస్తామని తెలిపారు. కేంద్రంలో మోడీ మమతాబెనర్జీని ఎలా అవమానిస్తున్నారో తెలంగాణలో బండి సంజయ్ తనను అలానే అవమానిస్తున్నారని తెలిపారు. అసభ్యంగా అవహేళన చేస్తూ బండి సంజయ్ మాట్లాడారన్నారు. ఎంపీగా ఒక్క రూపాయి కూడా బండి సంజయ్ తెలంగాణకు తేలేదని ఆరోపించారు.

Read More...

ఆధ్యాత్మికతతో శుభారంభం..రాజశ్యామల యాగంతో BRS entry

Advertisement

Next Story

Most Viewed