- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
KTR:లగచర్ల బాధితులను పరామర్శించిన కేటీఆర్.. సెన్సేషనల్ కామెంట్స్
దిశ,వెబ్‌డెస్క్: ఫార్మా కంపెనీ ఏర్పాటుకు అభిప్రాయ సేకరణకు వెళ్లిన వికారాబాద్ కలెక్టర్(Vikarabad Collector) ప్రతీక్ జైన్(Pratik Jain), అధికారులపై లగచర్ల గ్రామస్తులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం(TG Govt) వెంటనే వారిని అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలో పోలీసులు పలువురిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ ఘటన పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. గతంలో ఏ నియంత చేయనటువంటి దుర్మార్గమైన పాలన సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్(Former Minister KTR) మండిపడ్డారు. తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ లగచర్ల బాధితులను పరామర్శించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఓ అమ్మాయి ఛాతీ మీద కాలు పెట్టి తొక్కి ఆమె భర్తను పోలీసులు లాక్కెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం సోదరుడు తిరుపతి రెడ్డికి ఏ పదవి లేకపోయినా పేదలను బెదిరిస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టైన వారిని పోలీసులు విడిచిపెట్టాలంటే తాము చెప్పినట్లు భూములు రాసివ్వాలని భయపెడుతున్నారు అని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు.