- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీలో BRS విలీనానికి బండి సంజయ్ గ్రీన్ సిగ్నల్: మధుయాష్కీ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ, బీఆర్ఎస్ విలీనంపై మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు ఒక్కటేనని అన్నారు. బీఆర్ఎస్‌ను బీజేపీలో కలిపేస్తామని ఇటీవల ఆ పార్టీ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ వెళ్లి చర్చలు జరిపారని.. బీజేపీలో బీఆర్ఎస్ విలీనాన్ని కిషన్ రెడ్డి వ్యతిరేకిస్తే బండి సంజయ్ మద్దతు పలికారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అందుకే బండి సంజయ్ ఆదివారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ హరీష్ రావు మంచి లీడర్ అని పొగిడారని ఆరోపించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను బీజేపీ కూలుస్తుంటే కేసీఆర్ మద్దతు పలికారని అన్నారు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లో చేరే ఎమ్మెల్యేలకు ఎలాంటి హామీలు ఇవ్వడం లేదని.. రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రజా పాలనను చూసే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు.