- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టచ్‌లో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..కేసీఆర్ సెన్సేషనల్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో ఇవాళ జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఏడాది తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం గందరగోళంలో పడుతోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ దుర్మార్గుడు అని.. బీఆర్ఎస్‌కు 111 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే మన ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూశాడు.. ఇప్పుడు 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుకుండా ఉంచుతాడా అని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
కాకపోతే మన ఎమ్మెల్యేలను కొనాలని చూసి వాళ్లను అప్పుడు మనం దొరకబట్టినమని చెప్పారు. ఇక, సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడని నేను అనుకోవడం లేదని కేసీఆర్ అన్నారు. ఒక వేళ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్లిన ఆయన వెంట కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లరని గులాబీ బాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అయితే, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలోకి వెళ్లే తొలి వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డేనని కేసీఆర్ కొడుకు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపిస్తుండగా.. కేసీఆర్ మాత్రం రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడని తాను అనుకోవడం లేదనడం హాట్ టాపిక్‌గా మారింది.
Read More..