- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మానుకోట గడ్డమీద శపథం చేసిన CM రేవంత్ రెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: మహబూబాబాద్ కాంగ్రెస్ జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం పడిపోబోతోందని అని మాజీ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘మానుకోట గడ్డమీద శపథం చేసి చెబుతున్నా.. పదేళ్లు అధికారంలో ఉంటాం’ అని స్పష్టం చేశారు. తన కూతురు కోసం మోడీ కాళ్ల దగ్గర తెలంగాణను కేసీఆర్ తాకట్టు పెట్టారని మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్ కథ ముగిసిందని అన్నారు. రాష్ట్రంలో ఓట్లు అడిగే అర్హత బీజేపీ, బీఆర్ఎస్‌లకు లేదని అన్నారు. తెలంగాణకు మోడీ తీరని అన్యాయం చేశాడని చెప్పారు. తెలంగాణను పదేళ్ల పాటు బీజేపీ మోసం చేసిందని అన్నారు. విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సినవి కూడా ఇవ్వకుండా మోసం చేసిందని మండిపడ్డారు.
తెలంగాణలోనే కాదు.. కేంద్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోందని.. రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఎర్రకోటపై ఈ సారి కాంగ్రెస్ జెండా ఎగరేయబోతున్నట్లు తెలిపారు. వచ్చే జూన్ 9వ తేదీన ప్రధానిగా రాహుల్ గాంధీ ప్రమాణం చేయబోతున్నారని అన్నారు. మనుకోట ఎప్పటికీ కాంగ్రెస్ కంచుకోట అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో లాగా పార్లమెంట్ ఎన్నికల్లోనూ సీపీఎం, సీపీఐ, జనసమితి పార్టీల మద్దతు తీసుకున్నట్లు తెలిపారు. ప్రజస్వామ్యాన్ని రక్షించడానికి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం అనివార్యంగా మారిందని అన్నారు. ఆగష్టు 15వ తేదీ లోగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకుంటామని అన్నారు.
Read More...