‘లక్ష లోన్ తీసుకుంటే రూ. 65 వేలే కట్టండి’.. MP అర్వింద్ సంచలన వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2024-01-20 14:25:04.0  )
‘లక్ష లోన్ తీసుకుంటే రూ. 65 వేలే కట్టండి’.. MP అర్వింద్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఐకేపీ గ్రూపులకు 35 శాతం ప్రిన్సిపాల్ సబ్సిడీ ఉందని, లక్ష రూపాయలు లోన్ తీసుకుంటే రూ. 65 వేలు మాత్రమే కట్టాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. తాజాగా ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలకి లక్ష రూపాయల రుణం తీసుకుంటే రూ. 65 వేలు మీరు కట్టాలి. మిగతా ముప్పై ఐదు వేలు ప్రధాని మోడీ ఆయన జేబుల నుంచి ఇస్తున్నారు.’ అని అన్నారు. ఈ వ్యవహారంపై నెటిజన్లు మండిపడుతున్నారు. మోడీ జేబులో నుంచి ఇవ్వడం ఏమిటని అర్వింద్‌ను నిలదీస్తున్నారు.

Advertisement

Next Story