- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
IG - SP: వికారాబాద్ కలెక్టర్‌పై దాడి.. ఐజీ, ఎస్పీ సంచలన ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్ కలెక్టర్(Vikarabad Collector)పై దాడి వెనుక కుట్ర కోణం ఉందని జిల్లా ఎస్పీ నారాయణ(SP Narayana) అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మంగళవారం ఆయన ఐజీ సత్యనారాయణతో కలిసి మీడియాతో మాట్లాడారు. ముందుగా ఐజీ సత్యనారాయణ(IG Satyanarayana) మాట్లాడుతూ.. బోగమోని సురేశ్(Suresh) అనే వ్యక్తి కలెక్టర్‌ను తప్పుదోవ పట్టించారని అన్నారు. అధికారులు, కలెక్టర్‌ను పక్కకు తీసుకెళ్లి ఉద్దేశపూర్వకంగానే గ్రామస్తులతో దాడి చేయించారని తెలిపారు. సురేశ్ బీఆర్ఎస్ కార్యకర్త అని తేలింది. ఇతని స్వస్థలం హైదరాబాద్‌లోని మణికొండ. గ్రామస్తులను కావాలనే రెచ్చగొట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని అన్నారు. ప్రస్తుతం ఆరు గ్రామాల్లో పరిస్థితి అదుపులో ఉందని ఎస్పీ నారాయణ స్పష్టం చేశారు.
సమగ్ర విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రధాన నిందితుడు సురేశ్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పోలీసులు బృందాలుగా ఏర్పడి అతని కోసం గాలిస్తున్నాయని చెప్పారు. కాగా, అంతకుముందు మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu)తో వికారాబాద్ జిల్లా ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ఐజీ సత్యనారాయణ, కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణరెడ్డి మంత్రితో సమావేశం అయి లగచర్ల ఘటనను శ్రీధర్ బాబుకు వివరించారు. ప్రజాభిప్రాయానికి వెళ్లిన కలెక్టర్‌తో పాటు పలువురు అధికారులపై ప్లాన్ ప్రకారమే దాడి చేశారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు సైతం ఆ కోణంలో దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.