TG: సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశంకు పదోన్నతి

by Gantepaka Srikanth |
TG: సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశంకు పదోన్నతి
X

దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ ఐఏఎస్(IAS) అధికారి బుర్రా వెంకటేశం(Burra Venkatesham)కు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ప్రమోషన్ ఇచ్చింది. కాగా, ఇవాళ బుర్రా వెంకటేశంను టీజీపీఎస్సీ(TGPSC) చైర్మన్‌గా ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. దీంతో స్పెషల్ సీఎస్ హోదాలో ఆయన పదవీ విరమణ చేయనున్నారు. వీఆర్ఎస్ అనంతరం టీజీపీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. 2024 డిసెంబర్ 2 వరకు టీజీపీఎస్సీ చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి(Mahender Reddy) కొనసాగుతున్నారు.

డిసెంబర్ 2తో ఆయన పదవీ గడువు ముగియనుంది. తదనంతరం బుర్రా వెంకటేశం బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం బుర్రా వెంకటేశం భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ (BSG) చీఫ్​కమిషనర్‌గా కొనసాగుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బుర్రా వెంకటేశంను నియమించారు. గతంలో ఆయన కాలేజీ విద్యాశాఖ కమిషనర్‌గా, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్‌గా అడిషనల్ బాధ్యతలతో పాటు తెలంగాణ యూనివర్సిటీకి ఇన్ చార్జ్ వీసీగా కూడా పని చేశారు.

Advertisement

Next Story