- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
TANA : తానాకు కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్టు నోటీసులు !
దిశ, వెబ్ డెస్క్ : అమెరికా(America)లోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(TANA) తానాకు కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్టు(California District Court) నోటీసు(Notices)లు జారీ చేయడం కలకలం రేపింది. 2019 నుంచి ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాలు, లావాదేవీలు, విరాళాల వివరాలు ఇవ్వాలని నోటీసులో కోర్టు పేర్కొంది. డిసెంబర్ 12న నోటీసులు జారీ అయ్యాయి. డిసెంబర్ 26న పూర్తి సమాచారంతో డిస్ట్రిక్ట్ కోర్టు హౌస్ సాంగ్ జోష్‌లో తానా నిర్వాహకులు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొంది.
ఫిజికల్ డాక్యుమెంట్లతో పాటు, ఎలక్ట్రానిక్ డేటా, తానాలోని సభ్యుల వివరాలు కూడా తీసుకురావాలని..ప్రతి లావాదేవీకి సంబంధించిన వివరాలు సమర్పించాలని స్పష్టం చేసింది. ఆ సమాచారాన్ని ఎఫ్ బీఐ(FBI)కి కూడా మెయిల్ చేయాలని ఆదేశించింది. ఇప్పటికే తానాలో జరిగిన అవతవకలపై ఎఫ్ బీఐ విచారించింది. రూ.30కోట్ల గోల్ మాల్ లో కోశాధికారి పోలవరపు శ్రీకాంత్ కొంత సొమ్మును తానాకు జమచేశారు.
అమెరికాలోని తెలుగు సంఘాలతో కొందరు తెలుగు టెకీలు కుమ్మక్కై నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడమే కోర్టు నోటీసులకు దారితీసింది. ఆపిల్ గ్రాంట్ ప్రోగ్రామ్‌ను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై.. ఏకంగా 185 మంది తెలుగు ఉద్యోగులను ఆ సంస్థ తొలగించింది. మరికొన్ని సంస్థలు కూడా తెలుగు ఉద్యోగులను తొలగించవచ్చనే భయందోళనలు నెలకొన్నాయి.
ఆపిల్ గ్రాంట్ ప్రోగ్రామ్ ద్వారా తెలుగు సంఘాలకు విరాళాల రూపంలో ఇచ్చిన నిధులు.. ఉద్యోగుల సొంత ఖాతాలకు మళ్లించినట్లు ఆపిల్ సంస్థ నిర్ధారించింది. దాంతో నిధుల కుంభకోణంపై ఎఫ్ బీఐ, అమెరికా కోర్టులు రంగంలోకి దిగాయి. ప్రస్తుతం తానాకు నిరంజన్ సంఘవరపు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే అమెరికాలో తెలుగు సంఘాలు రకరకాలుగా విడిపోయాయి. గతంలో నాటాపైన అనేక ఆరోపణలు రావడంతో దర్యాప్తు సంస్థలు దానిని మూసివేశాయి. ఇప్పుడు తానాకు కూడా అదే గతి పట్టవచ్చన్న ఆందోళన అక్కడ ఉన్న తెలుగు ప్రజల్లో వ్యక్తమవుతోంది.