- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ విషయంలోనే రాహుల్ గాంధీపై కక్ష గట్టారు: వీహెచ్
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ వీ.హనుమంతరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కొందరు మోడీలు దేశాన్ని లూటీ చేస్తున్నారని రాహుల్ మాట్లాడినట్లు గుర్తుచేశారు. ఓబీసీ సమస్యలపై ప్రధాని మోడీని కలిసినా పరిష్కరించలేదని అన్నారు. ఓబీసీ సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. క్రిమిలేయర్ ఎత్తివేయాలని కోరారు. ఎనిమిదేళ్లలో ఓబీసీలకు బీజేపీ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
అదానీ వ్యవహారాన్ని ప్రశ్నించ్చినందునే రాహుల్‌పై కక్ష గట్టారని మండిపడ్డారు. మహాత్మాగాంధీని చంపిన గాడ్సేను కొనియాడిన ప్రజ్ఞా ఠాకూర్‌పై చర్యలుండవా? అని ప్రశ్నించారు. అనంతరం మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బండి సంజయ్, లక్ష్మణ్ ఓబీసీలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని కోరడం సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాల వారీగా కుల జనగనన చేయాలని కోరితే సుప్రీంకోర్టుకు వెళ్లి అడ్డుకుంది బీజేపీ కాదా? అని ప్రశ్నించారు. ఓబీసీల సమస్యలపై స్పందించినందుకు, వారికి న్యాయం చేయాలని కోరినందుకు క్షమాపణ చెప్పాలా? అని మండిపడ్డారు. చాతనైతే ముందు వారి సమస్యలు పరిష్కరించాలని సూచించారు.