- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అది జరిగితే.. రాజకీయ సన్యాసం తీసుకుంటా: VH కీలక ప్రకటన
X
దిశ, వెబ్‌డెస్క్: పీసీసీ మాజీ చీఫ్, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ ప్రభుత్వ అవినీతిపై సిట్ విచారణ జరిపించాలని.. సిట్ విచారణలో అవినీతి జరగలేదని తేలకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని వీహెచ్ ప్రకటించారు. ప్రస్తుతం తెలంగాణలో ఏం పని జరగాలన్న లంచం ఇవ్వాల్సిందేనని ఆరోపించారు. దళిత బంధు పథకంలో కూడా కమీషన్లు తీసుకుంటున్నారని అన్నారు. తెలంగాణ రైతులు చనిపోతే ఒక్క రూపాయి ఇవ్వలేదు కానీ.. సీఎం కేసీఆర్ పంజాబ్ వెళ్లి అక్కడ డబ్బు పంచిపెట్టారని ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజలకు అడుగడుగునా అన్యాయమే జరుగుతోందని వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ అధికారంలోకి వచ్చేది లేదని.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయే అని దీమా వ్యక్తం చేశారు.
Advertisement
Next Story