బీజేపీలో స్వాతంత్య్ర సమరయోధులు లేరు: వీహెచ్

by GSrikanth |   ( Updated:2023-02-17 15:14:57.0  )
బీజేపీలో స్వాతంత్య్ర సమరయోధులు లేరు: వీహెచ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీలో స్వాతంత్ర్య సమరయోధులు ఎవరూ లేరని, అందుకే ఆ పార్టీకి దేశంలోని క్షేత్రస్థాయి సమస్యలు తెలియవని కాంగ్రెస్​సీనియర్​నేత వీ హనుమంతరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ రాముడిని పూజిస్తేనే దేశంలో ఉండాలని బీజేపీ నేతలు చెప్పడం సరికాదన్నారు. బీజేపీ ప్రభుత్వం నెహ్రూ చరిత్రను కనుమరుగు చేసే కుట్ర చేస్తుందన్నారు. వీర్ సావార్కర్‌ను బీజేపీ ప్రమోట్​చేయడం వెనక ఆంతర్యమేమిటో తెలుపాలన్నారు. మరోవైపు టిప్పు సుల్తాన్ వారసులను దేశం నుంచి వెళ్ళగొట్టాలంటూ కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు అనడం దుర్మార్గమన్నారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ చేసి, రిజర్వేషన్స్ ఎత్తేసే కుట్రలు బీజేపీ చేస్తున్నదని విమర్శించారు. దేశ సంపదను కొల్లగొడుతున్న అదానీ, అంబానీల గురించి బీజేపీ మాట్లాడదని వీహెచ్ పేర్కొన్నారు.

Also Read...

కేసీఆర్ నెక్ట్స్ బర్త్ డే జైల్లోనే.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed