- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బ్రేకింగ్: ఢిల్లీలో BRS ఎంపీకి నిరసన సెగ.. కారుకు అడ్డుగా నిలిచి శేజల్ ఆందోళన!
దిశ, వెబ్‌డెస్క్: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు, ఆరిజిన్ డైరీ సీఈవో శేజల్ ఆందోళనను మరింత ఉదృతం చేసింది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ వేదికగా నిరసన వ్యక్తం చేస్తోన్న శేజల్ ఇవాళ ఢిల్లీలో బీఆర్ఎస్ ఎంపీల ముందు ఆందోళన వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి వాహనానికి అడ్డుగా నిలిచి శేజల్ నిరసన వ్యక్తం చేసింది. దీంతో సురేష్ రెడ్డి కారు దిగి ఆమెను కలిశారు.
అనంతరం ఎంపీతో మాట్లాడిన శేజల్.. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అనుచరుల నుండి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆయనకు ఫిర్యాదు చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే చిన్నయ్యపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని శేజల్ ఎంపీని కోరింది. దీనికి స్పందించిన ఎంపీ సురేష్ రెడ్డి వివరాలు ఇస్తే మాట్లాడుతానని హామీ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా తమకు న్యాయం చేయాలని ఆరిజిన్ డైరీ సీఈవో ఆదినారాయణ ఎంపీ సురేష్ రెడ్డి కాళ్లపై పడి వేడుకున్నారు.
కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాంటూ గత కొంత కాలంగా శేజల్ ఆరోపణలు చేస్తోంది. తనకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తోంది. తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని.. శేజల్ ఢిల్లీ వేదికగా నిరసన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యే చిన్నయ్యపై జాతీయ మహిళ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్, సీబీఐలకు శేజల్ ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా తనకు ఎమ్యెల్యే, ఆయన అనుచరులు నుండి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని శేజల్ రెండు సార్లు ఆత్మహయ్యయత్నం చేసింది.