- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Seethakka: అల్లు అర్జున్ పై మాకు ఎలాంటి కక్ష లేదు.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: అల్లు అర్జున్(Allu Arjun) పై తమకు ఎలాంటి కక్ష లేదని, అరెస్ట్(Arrest) చట్ట ప్రకారమే(As Per The Law జరిగిందని పంచాయితీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) స్పష్టం చేశారు. నిర్మల్ జిల్లా(Nirmal district) పర్యటనలో ఉన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అల్లు అర్జున్ అరెస్ట్ పట్ల కాంగ్రెస్ పార్టీCongress partyపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. అల్లు అర్జున్ అరెస్ట్ చట్ట ప్రకారం జరిగిందని, ఆయనపై తమకు ఎలాంటి కక్ష లేదన్నారు. ఢిల్లీ(Delhi)లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మీడిమాతో అన్ని విషయాలు స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తరుఫున సీఎం రేవంత్ రెడ్డికి బంధుత్వం ఉందని, ఆయన మామ మెగస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో కేంద్రమంత్రిగా కూడా చేశారని , ఇన్ని సత్సంబంధాల మధ్య ఆయనపై కక్ష ఎందుకు ఉంటుందని మంత్రి తెలిపారు. థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ ప్రాణాలు కోల్పోయిందని, చట్టం ఎవరికి చుట్టం కాదని, చట్ట ప్రకారమే అరెస్ట్ జరిగిందని, చట్టప్రకారమే బెయిల్ కూడా వచ్చిందని సీతక్క వివరించారు.