Seethakka: సచివాలయ ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడిన మంత్రి సీతక్క

by Ramesh Goud |   ( Updated:2024-10-05 13:09:59.0  )
Seethakka: సచివాలయ ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడిన మంత్రి సీతక్క
X

దిశ, డైనమిక్ బ్యూరో: సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ ఉత్సవాల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులతో కలిసి మంత్రి అడుగు కలిపారు. మూడో రోజు బతుకమ్మ సంబరాల్లో భాగంగా డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం వద్ద బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సచివాలయ మహిళా ఉద్యోగులు వివిధ రకాల పూలతో బతుకమ్మలు పేర్చి సచివాలయ ప్రాంగణం ముందు ముద్దపప్పు బతుకమ్మ ఆడారు. అయితే ఈ కార్యక్రమంలో తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. సచివాలయ ఉద్యోగులతో కలిసి బతుకమ్మ పాటకు అడుగు కలిపారు. ఈ సందర్భంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మహిళలందరికీ సీతక్క శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముందు ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాలకు సీతక్క హాజరయ్యారు. యూనివర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది సహా విద్యార్థినులతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఓయూ సిబ్బంది మంత్రి సీతక్కను సన్మానించారు.




Advertisement

Next Story