హరితహారం ఇక స్వచ్ఛదనం-పచ్చదనం

by M.Rajitha |
హరితహారం ఇక స్వచ్ఛదనం-పచ్చదనం
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమంగా గత ప్రభుత్వం మొదలు పెట్టిన హరితహారంను స్వచ్ఛదనం-పచ్చదనంగా మార్చి ఈ నెల 5 నుండి 11 వరకు పెద్ద ఎత్తున నిర్వహించబోతునట్టు రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ప్రారంభ దినం అయిన 5వ తేదీన అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో స్థానిక నాయకులు, మహిళా సంఘాలు, విద్యార్థుల చేత పెద్ద ఎత్తున మొక్కలు నాటించి, ర్యాలీలు చేపట్టాలన్నారు. అన్ని పాఠశాలల్లో మొక్కల పెంపకం, పారిశుద్ధ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, సీజనల్ వ్యాధుల వంటి అంశాలపై పోటీలు నిర్వహించాలన్నారు. ప్రతి శుక్రవారం అన్ని గ్రామపంచాయితీల్లో, పట్టణ సంస్థల్లో డ్రైడేగా నిర్వహించి, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి, పశుసంవర్ధక శాఖ ఆద్వర్యంలో కుక్కల సర్వే చేపట్టాలని మంత్రి సీతక్క అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

Next Story

Most Viewed