రేవంత్ రెడ్డి నివాసం వద్ద భద్రత పెంపు

by GSrikanth |
రేవంత్ రెడ్డి నివాసం వద్ద భద్రత పెంపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్​శాసనసభా పక్ష నాయకునిగా ఎంపికైన రేవంత్​రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్​జూబ్లీహిల్స్​సీబీఐ కాలనీలోని ఆయన నివాసం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రొటోకాల్​ప్రకారం రేవంత్​రెడ్డి వద్ద పూర్తి స్థాయి సెక్యూరిటీని కల్పించనున్నారు. హ్యాట్రిక్​సాధించాలన్న బీఆర్ఎస్​ఆశలకు గండి కొడుతూ కాంగ్రెస్​అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ప్రచారం జరుగుతూ వస్తోంది. మంగళవారం అదే నిజమైంది.

కాంగ్రెస్​అధిష్టానం రేవంత్​రెడ్డిని కాంగ్రెస్​శాసనసభా పక్ష నాయకునిగా ఎంపిక చేసింది. కాబోయే ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి అని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసు ఉన్నతాధికారులు రేవంత్​రెడ్డి ఇంటి వద్ద భద్రతను పెంచారు. 15 మంది కానిస్టేబుళ్లను ఆయన నివాసం వద్ద మోహరించారు. బారికేడ్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రేవంత్​రెడ్డి ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద మంగళవారం పెద్దగా హడావిడి కనిపించలేదు. అయితే, రేవంత్​రెడ్డి హైదరాబాద్​చేరుకున్న తరువాత పెద్ద సంఖ్యలో కాంగ్రెస్​నాయకులు, కార్యకర్తలు ఆయన ఇంటి వద్దకు చేరుకోవటం ఖాయమని చెబుతున్న పోలీసు ఉన్నతాధికారులు దానిని దృష్టిలో పెట్టుకునే సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గాంధీభవన్‌లో కూడా భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తామని తెలిపారు.

Advertisement

Next Story