గంజాయి మొక్కలు పెంచుతున్న సెక్యూరిటీ గార్డ్ అరెస్ట్

by M.Rajitha |
గంజాయి మొక్కలు పెంచుతున్న సెక్యూరిటీ గార్డ్ అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : గంజాయి మొక్కలు పెంచుతున్న సెక్యూరిటీ గార్డును పోలీసులు అరెస్ట్ చేశారు. కుత్బుల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దూలపల్లి ఎక్స్ రోడ్డు సమీపంలో ఓ వ్యక్తి గంజాయి మొక్కలు పెంచుతున్నాడనే సమాచారం రాగా.. ఎక్సైజ్ పోలీసులు ఆ ఇంటిపై దాడులు నిర్వహించారు. బీహారుకు చెందిన వికాస్ అనే వ్యక్తి ఓ ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. తను నివసిస్తున్న ఇంటి సమీపంలో గంజాయి మొక్కలు పెంచుతూ స్వంతంగా వాడుతున్నాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసులు గంజాయి మొక్కలను పీకేసి, వికాస్ ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి గంజాయి వినియోగంపై ఉక్కుపాదం మోపుతోంది. ఎక్కడికక్కడ దాడులు చేస్తూ డ్రగ్స్ ముఠాల భరతం పడుతున్నారు.

Next Story