- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాష్ట్రపతి పర్యటనకు భద్రతా ఏర్పాట్లు పూర్తి
దిశ, బూర్గంపాడు:బూర్గంపాడు మండలం సారపాకలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పర్యటనకు సర్వం సిద్ధం చేశారు.బుధవారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సారపాకలోని ఐటీసీ స్కూల్ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలిప్యాడులో రాష్ట్రపతి దిగనున్నారు. చలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శన అనంతరం పలు పథకాలను ప్రారంభించనున్నారు. రాష్ట్రపతి భద్రాచలంలో గిరిజనులతో సమావేశం కానున్నారు. ఇందుకోసం ఐటీసీ స్కూల్, ఐటీసీ గెస్ట్ హౌస్ తదితర ప్రాంతాల్లో పోలీసులు విస్తృత బందోబస్తు నిర్వహిస్తున్నారు. సారపాకలోని ఐటీసీ పీఎస్పీడీ కర్మాగారం అరుదైన ఘనతను దక్కించుకోనుంది. భద్రాచలానికి గతంలో రాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణ, శంకర్ దయాల్ శర్మలు వచ్చారు. సుదీర్ఘకాల అనంతరం రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము భద్రాచలం బుధవారం రానున్నడంతో ఐటీసీ అతిథ్యం ఇవ్వనుంది. ఐటీసీలో బస చేయనున్న తొలి రాష్ట్రపతిగా ద్రౌపతి ముర్ము నిలవనున్నారు. ఇందుకోసం ఐటీసీ ఉన్నత అధికారుల బృందం తగిన ఏర్పాట్లల్లో నిమగ్నమైంది. రాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా రెండు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ వినీత్ ఆధ్వర్యంలో రాష్ట్రపతి పర్యటించే ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. సారపాక, భద్రాచల ప్రాంతాల్లోని పాఠశాలలకు బుధవారం సెలవు ప్రకటించాయి. భద్రాచలం నుంచి సారపాక వరకు రాకపోకలను నిలిపేసేందుకు అధికారులు ఇప్పటికే ప్రకటన చేశారు. భద్రాచలం ఆర్టీసీ డిపో సైతం బూర్గంపాడులో ప్రత్యేక ఏర్పాట్లు చేసే పనిలో నిమగ్నమైంది. అదే క్రమంలో భద్రాచలంకు అన్ని వైపుల నుంచి సారపాక నుంచి వెళ్లే వాహనాల రాకపోకలు నిలుపుదల చేశారు.
ట్రయల్ రన్ సక్సెస్:
రాష్ట్రపతి పర్యటన పురస్కరించుకొని జిల్లా అధికార యంత్రాంగం మంగళవారం సారపాకలోని ఐటీసీబీపీఎల్ స్కూల్ నుంచి ఐటీసీ గెస్ట్ హౌస్, సారపాక మీదుగా భద్రాచలం లోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం, అనంతరం వీరభద్ర ఫంక్షన్ హాల్ వరకు ట్రయల్ రన్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అనుదీప్, జిల్లా ఎస్పీ వినీత్ పర్యవేక్షణలో ట్రయల్ రన్ సక్సెస్ అయింది.