Secretariat: సీఎం ఫారిన్ టూర్ ఎఫెక్ట్.. బోసిపోతున్న సచివాలయం

by Shiva |
Secretariat: సీఎం ఫారిన్ టూర్ ఎఫెక్ట్.. బోసిపోతున్న సచివాలయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనలో ఉండటంతో సెక్రటేరియట్ బోసిపోయి కనిపిస్తుంది. వివిధ పనుల కోసం వచ్చే సందర్శకుల సంఖ్య తగ్గింది. ఒకవేళ వచ్చినా విజిటర్స్‌కు అందుబాటులో మంత్రులు, అధికారులు ఉండకపోవడంతో వెంటనే వెనక్కి వెళ్లిపోతున్నారు. మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి, స్పెషల్ సీఎస్ రామకృష్ణరావు, సీఎంవో అధికారులు సీఎంతో పాటు విదేశీ యాత్రలో ఉన్నారు. మిగతా మంత్రులు జిల్లాల పర్యటనలో బిజీగా ఉంటున్నారు. వివిధ శాఖలకు చెందిన సెక్రెటరీలు సాయంత్రం వరకు ఆఫీసులో ఉండటం లేదని అలా వచ్చి, ఇలా వెళ్లిపోతున్నట్టు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రేవంత్ సీఎం‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సెక్రెటేరియట్‌లోకి విజిటర్స్ సంఖ్య పెరిగింది. రోజుకు సగటున 3 వేల మంది వరకు విజిటర్స్ పాసులు తీసుకునే లోనికి వెళ్లేవారు. కానీ ఈ నెల 4 న సీఎం ఫారిన్ టూర్‌కు వెళ్లినప్పటి నుంచి సెక్రటేరియట్‌లో హాలి‌డే వాతావరణం కనిపిస్తోంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మెజారిటీ ఆఫీసర్ల డోర్లకు తాళాలు కనిపిస్తున్నాయని, వివిధ పనుల కోసం వచ్చే విజిటర్స్ ఆరోపిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed