- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం రేవంత్ రెడ్డి ముందుచూపు.. భవిష్యత్ సమస్యల పరిష్కారానికి శ్రీకారం
దిశ వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అభివృద్ధిపై ద్రుష్టి సారించారు. భవిష్యత్ లో రానున్న సమస్యల్ని గుర్తించి ముందుచూపుతో వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న ముప్పై సంవత్సరాలలో ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకుని జీహెచ్ఎంసీ రూపొందించిన స్ట్రాటెజికల్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ (ఎస్ఆర్‌డీపీ) కింద రూ.148.05 కోట్లను వెచ్చించి బైరామల్‌గూడ జంక్షన్‌లో సెకండ్ లెవల్ ఫ్లై ఓవర్ నిర్మించిన విషయం అందరికి తెలిసిందే.
కాగా శనివారం తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఈ ప్లై ఓవర్‌ను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. దీంతో విజయవాడ, నాగార్జునసాగర్ రహదారిలో ట్రాఫిక్ నుంచి కాస్త ఊరట లభించినట్టయింది. ఇక ఈ ఫ్లై ఓవర్ 1786.60 మీటర్లు పొడువు, వయోడక్ట్ పొడువు 1305.60 మీటర్లు, స్టాండర్డ్ స్పాన్960.00 (32x30 మీటర్లు), ఆబ్లిగేటరీ స్పాన్ 345.60 మీటర్లు, లెంథ్ ర్యాంప్స్ 481 మీటర్లు, ఓవైసీ సైడ్ 143 మీటర్లు, చింతల్ కుంట సైడ్ 212 మీటర్లు, నాగార్జున సాగర్ సైడ్ 126 మీటర్లు కాగా ఈ ఫ్లై ఓవర్ నిర్మాణానికి అయినా ఖర్చు రూ.148.05 కోట్లు.
ఇక అలానే బైరామల్‌గూడ జంక్షన్ వద్దనున్న లూప్ విషయానికి వస్తే.. మొత్తం పొడువు 210 మీటర్లు కాగా, వయోడక్ట్ పొడువు 185 మీటర్లు. ఇక అలానే ర్యాంప్ పొడువు 25 మీటర్లు కాగా ఫ్లైఓవర్ వెడల్పు 9.70 మీటర్లు. ఈ లూప్ నిర్మాణానికి అయిన ఖర్చు రూ.21.56 కోట్లు. కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ సెకండ్ లెవెల్ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావటంతో ఓవైసీ నుంచి చింతలకుంట మీదుగా విజయవాడ వైపు వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తీరటంతో పాటు తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించే వీలు కలిగింది.
దీంతో జర్నీ టైమ్, ఇంధనం కూడా ఆదా అవుతుంది. బీఎన్ రెడ్డి నగర్ నుంచి నాగార్జున సాగర్ వెళ్లేందుకు ఈ ఫ్లై ఓవర్ ఉపయోగపడుతుంది. అలానే ఎడమ వైపున్న లూప్‌తో బైరామల్ గూడ జంక్షన్ నుంచి నాగార్జున సాగర్ వైపు వెళ్లే వాహనాలతో పాటు చింతల్‌కుంట నుంచి ఎల్బీనగర్ మీదుగా సికింద్రాబాద్ వైపు వచ్చే వాహనాలు ఏ అండ్డంకులు లేకుండా ముందుగు సాగనున్నాయి.
ఇక కుడివైపున్న లూప్‌తో బైరామల్‌గూడ జంక్షన్ వద్ద రైట్ టర్న్ తీసుకునే వాహనాలు, ఎల్బీనగర్ నుంచి కర్మాన్‌ఘాట్ వైపు వెళ్లే వాహనాలు ట్రాఫిక్ అండ్డంకులు లేకుండా ప్రయాణించవచ్చు. కొత్త ఫ్లైఓవర్ అందుబాటులోకి రావటంతో జర్నీ టైమ్, ఇంధనం సేవ్ కావటంతో పాటు కొంత వరకు వాహన కాలుష్యం కూడా తగ్గనుంది.