Ganesh Immersion: గణపతి విగ్రహానికి సీట్ బెల్ట్.. రాచకొండ పోలీస్ వినూత్న సందేశం..

by Ramesh N |   ( Updated:2024-09-12 09:41:11.0  )
Ganesh Immersion: గణపతి విగ్రహానికి సీట్ బెల్ట్.. రాచకొండ పోలీస్ వినూత్న సందేశం..
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో వినాయకుడి నిమజ్జనాలతో కోలాహలంగా మారింది. గణేషుడి విగ్రహాలను ట్రాక్టర్లు, లారీలు, కార్లు లాంటి వివిధ వాహనాలపై ఉంచి డప్పులు, టపాకాయలు, డీజే సౌండ్ సిస్టమ్స్‌తో నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా నిమజ్జనం షూరు అయింది. ఈ క్రమంలోనే రాచకొండ పోలీసులు ట్రాఫిక్ రూల్స్‌పై వినూత్న ఆవగాహన కల్పించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఒక ఫోటో షేర్ చేశారు. నిమజ్జనానికి తీసుకెళ్లే వినాయకుడు డ్రైవర్ లాగా సీట్ బెల్ట్ ధరించినట్లు ఫోటోలో కనిపిస్తున్నాడు. మరోవైపు డ్రైవింగ్ సీట్లో ట్రాఫిక్ పోలీస్ ఉన్నత అధికారిని సీట్ బెల్ట్‌తో ఉన్నారు.

వినాయక ఉత్సవాల సందర్బంగా ప్రజలు, వాహనదారులకు రోడ్డు భద్రతా నియమాలు, సీటు బెల్ట్‌ ప్రముఖ్యతను తెలియజేసేలా వినాయకుడి రూపంలో సీట్ బెల్ట్‌పై పోలీసులు అవగాహన కల్పించారు. ‘వినాయకుడు కూడా సీట్ బెల్ట్ ధరించాడు. మనం ఎందుకు ధరించకూడదు? మనం రోడ్డుపై వెళ్తున్న ప్రతిసారీ భద్రత, సంప్రదాయం రెండింటినీ గౌరవిద్దాం. ఒక చిన్న చర్య ప్రాణాలను కాపాడుతుంది’ అని ఎక్స్‌లో రాచకొండ పోలీసులు వినూత్నంగా సందేశం ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed