ఫైనల్లీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సూర్య ‘కంగువ’.. వచ్చేది ఎప్పుడంటే?

by sudharani |
ఫైనల్లీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సూర్య ‘కంగువ’.. వచ్చేది ఎప్పుడంటే?
X

దిశ, సినిమా: స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో దిశ పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని హ్యూజ్ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ దసరా సందర్భంగా అక్టోబర్ 10న రిలీజ్ చేయాలని నిర్ణయించారు మేకర్స్. కానీ ఇటీవల ఈ నిర్ణయాన్ని మార్చుకున్నారు.

అదే టైంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ‘వెట్టయాన్’ రిలీజ్ ఉండటంతో.. బాక్సాఫీస్ వద్దా పోరు ఎందుకని సూర్య ‘కంగువ’ రిలీజ్‌ను పోస్ట్ పోన్ చేసుకున్నారు. దీంతో ఈ మూవీ రిలీజ్‌పై క్లారిటీ లేక ఫ్యాన్స్ నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ‘కంగువ’ రిలీజ్ డేట్‌పై అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది ప్రొడక్షన్ టీమ్. ‘కంగువ’ కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఈ మేరకు ‘ప్రపంచం సాక్షిగా ప్రైడ్ అండ్ గ్లోరీ యుద్ధం స్టార్ట్ కానుంది. #కంగువా యొక్క శక్తివంతమైన పాలన 14-11-2024 నుండి తెరపైకి వస్తుంది’ అని తెలిపారు. ఇక నవంబర్ 14న ‘కంగువ’ గ్లోబల్ రిలీజ్‌కు సిద్ధం కావడంతో.. ఫ్యాన్స్ ఆనందంలో మునిగితేలుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed