Drugs: మాదాపూర్‌లో డ్రగ్స్ కలలకం.. ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు అరెస్ట్

by Shiva |
Drugs: మాదాపూర్‌లో డ్రగ్స్ కలలకం.. ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు సర్కార్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలంటూ పోలీసు శాఖ (Police Department)కు ఆదేశాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే టాస్క్‌ఫోర్స్ (Taskforce), ఎస్‌ఓటీ (SOT), ఇతర పోలీసు సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లు (Railway Stations), ఎయిర్‌పోర్టు(Airports)లు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతూ.. ఎక్కడికక్కడ గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకుని కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా, బుధవారం అర్ధరాత్రి మాదాపూర్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లుగా ఎక్సైజ్ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు వారు హుటాహుటిన స్పాట్‌కు చేరుకుని డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వారి నుంచి 30 ఐఎస్‌డీ బ్లాడ్స్ డ్రగ్ (ISD bloods drug), ఓ బైక్‌, రూ.70 వేలు విలువ చేసే ఇతర డ్రగ్స్‌ను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, చెన్నైలో విద్యార్థులు డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది.

Advertisement

Next Story

Most Viewed