- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
SCR: దక్షిణ మధ్య రైల్వే సరికొత్త రికార్డు.. రూ.20వేల కోట్ల రెవెన్యూ
దిశ, తెలంగాణ బ్యూరో: 2023-24 ఆర్థిక సంవత్సరంలో స్థూల మూలాధార ఆదాయంలో రూ.20,339.36 కోట్ల ఆదాయాన్ని దక్షిణ మధ్య రైల్వే ఆర్జించిందన జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ వెల్లడించారు. ఇది జోన్ ప్రారంభమైనప్పటి నుంచి అత్యధికమని, 2022-23లో సాధించిన రూ.18,976 కోట్ల కంటే 7 శాతం అధికమని తెలిపారు. ఆదివారం అయన మీడియాతో మాట్లాడుతూ.. 2022-23 ఆర్థిక సంవత్సరంలోని విశేషమైన పనితీరు ఆధారంగా 2023-2024 ఆర్థిక సంవత్సరంలో స్థూల మూలాధార ఆదాయంలో రూ.20వేల కోట్ల ఆదాయాన్ని అధిగమించడంతో మరో కీలకమైన మైలురాయిని సాధించిందని తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో స్థూల మూలాధార ఆదాయంలో రూ.20,339.36 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసిందని, ఇది జోన్ ప్రారంభమైనప్పటి నుంచి అత్యధికమని వెల్లడించారు.
ముఖ్యంగా జోన్ చేపట్టిన పలు చర్యలో భాగంగా ఈ వృద్ధి సాధ్యపడిందని అన్నారు. ప్రయాణీకుల అవసరాలను తీర్చడానికి చేపట్టిన చర్యల, కొత్త, ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడం, డిమాండ్ ఉన్న రైళ్లలో అదనపు కోచ్‌ల జోడింపుతో రైళ్లను పెంచడం వంటి చర్యలను తీసుకుందని తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో అధిక ప్రయాణీకుల అవసరాలను తీర్చడానికి 117 రైళ్లలో తాత్కాలిక ప్రాతిపదికన 6,921 అదనపు కోచ్‌లు పెంచబడ్డాయని దీంతో ప్రయాణీకుల రవాణాలో రూ.5,731.8 కోట్ల అత్యుత్తమ ఆదాయాన్ని సాధించడంలో దోహద పడిందని అన్నారు.
సరుకు రవాణా విభాగంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో, దక్షిణ మధ్య రైల్వే మునుపెన్నడూ లేని విధంగా రూ.13,620 కోట్ల సాధించిందని, ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే 4.4% పెరుగుదలను నమోదు చేసిందని అన్నారు. ఇందులో భాగంగా 6 కొత్త గతిశక్తి కార్గో టెర్మినల్స్ ఏర్పాటు, ఏడాది పొడవునా మూడు నూతన సైడింగ్‌ల ప్రారంభోత్సవం ఉన్నాయని తెలిపారు. అత్యుత్తమ సరుకు రవాణా లోడింగ్ 141.12 మిలియన్ టన్నులు సాధించడానికి సాధ్యపడిందని పేర్కొన్నారు. జోన్‌కు ఇదొక చారిత్రక మైలురాయిని సూచిస్తుందని జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అన్నారు.
రైల్వే పార్శిల్ ద్వారా ఆదాయం, టిక్కెట్ చెకింగ్ వలన వచ్చిన రాబడి మొదలైనవి ఉన్నాయని, దీని ద్వారా రూ.512 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసిందని తెలిపారు. 2022-23 సంవత్సరంలో ఇతర కోచింగ్ విభాగంలోని నమోదైన రూ.414.87 కోట్ల ఆదాయం కంటే ఎక్కువ అని పేర్కొన్నారు. ఇంతే కాకుండా వివిధ ఆదాయాలలో 2022-23 సంవత్సరంలో రూ.369 కోట్ల ఆదాయం నమోదు చేయగా, 2023-24 సంవత్సరంలో రూ.474 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందని, ఇది గత సంవత్సరం రూ.369 కోట్లతో పోలిస్తే 28 శాతం ఎక్కువ నమోదు అయిందని తెలిపారు.
ఈ మైలురాయిని సాధించడంలో అలుపెరగని ప్రయత్నాలు చేసిన అధికారులు, సిబ్బంది బృందం కృషిని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ప్రశంసించారు. రైలు ప్రయాణీకుల ప్రయోజనాల కోసం రైలు రవాణా ప్రమాణాలను మరింతగా పెంచేందుకు, గొప్ప విజయాలను సాధించేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా అదే ప్రయత్నాలను కొనసాగించాలని అధికారులకు సూచించారు.