ఒక్కో యూనిఫాంకు రూ.50.. స్వయం సహాయక బృందాలను గుర్తింపు

by Sathputhe Rajesh |
ఒక్కో యూనిఫాంకు రూ.50.. స్వయం సహాయక బృందాలను గుర్తింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని 26,79,497 మంది విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలను ప్రభుత్వం అందించనుంది. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ లోకల్​బాడీ, కేజీబీవీ, అర్బన్​రెసిడెన్షియల్​స్కూళ్లు, మోడల్​స్కూళ్లు, గురుకులాలు, ప్రైమరీ, ఎయిడెడ్​పాఠశాలలకు చెందిన ఒకటో తరగతి నుంచి ఇంటర్​వరకు విద్యార్థులకు యూనిఫాంలు అందించనున్నారు. దానికి కావాల్సిన వస్త్రాలను టీఎస్​సీవో అందించనుంది. కాగా యూనిఫాంలు కుట్టేందుకు స్వయం సహాయక బృందాలను గుర్తించాలని పాఠశాల విద్య డైరెక్టర్​దేవసేన సోమవారం సర్క్యులర్​జారీ చేశారు. జిల్లాల వారీగా కలెక్టర్లు, సమగ్ర శిక్షణ చైర్ పర్సన్లు వెంటనే స్వయం సహాయక బృందాలను గుర్తించాలని ఆదేశించారు. బెస్ట్​స్వయం సహాయక బృందాలను గుర్తించాలని, దీని వల్ల వారికి కూడా ఉపాధి దొరుకుతుందని తెలిపారు. కాగా ఒక్కో యూనిఫాం కుట్టేందుకు రూ.50 అందించనున్నట్లు స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed