- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దసరా సెలవులపై పాఠశాల విద్యాశాఖ క్లారిటీ
దిశ, తెలంగాణ బ్యూరో: దసరా సెలవులపై పాఠశాల విద్యాశాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు. అకడమిక్ క్యాలెండర్‌లో పొందుపరిచిన ప్రకారమే హాలీడేస్ ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, హైస్కూళ్లకు ఈనెల 26వ తేదీ నుంచి వచ్చే నెల 9వ తేదీ ప్రకారం సెలవులు ఇస్తున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇదిలా ఉండగా ఇటీవల కురిసిన వర్షాలకు, జాతీయ సమైక్యతా దినోత్సవానికి స్కూళ్లకు ప్రభుత్వం సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా సిలబస్ పూర్తిచేయడం కష్టమవుతుందనే ఉద్దేశ్యంలో ఎస్ సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి పాఠశాల విద్యాశాఖ అధికారులకు లేఖ రాశారు. దసరా హాలీడేస్‌ను 9 రోజులకు కుదించడం కానీ, ముందుగా అనుకున్న ప్రకారమే 14 రోజులు సెలవులిస్తే రెండో శనివారాలు కూడా స్కూళ్లు పెట్టాలని లేఖలో పేర్కొన్నారు. కాగా దీనిపై ఉపాధ్యాయ సంఘాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో అధికారులు వెనక్కి తగ్గారు. హిందువుల పండుగలకే అధికారులకు ఇలాంటి ఆలోచనలు రావడమేంటని విరుచుకుపడ్డారు. హిందూయేతర వేడుకలకు ఎలాంటి అడ్డంకులు చెప్పని అధికారులు ఇప్పుడెందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించడంతో విద్యాశాఖ అధికారులు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. మొత్తానికి పాఠశాల విద్యాశాఖ అధికారులు దసరా హాలీడేస్‌పై సస్పెన్స్‌కు తెరదించారు.