కారు షెడ్డుకు పోయింది.. ఆఖరికి ఆటో దిక్కయ్యింది.. కేటీఆర్‌పై నెటిజన్ల సెటైర్లు (వీడియో)

by Ramesh N |   ( Updated:2024-01-29 05:22:59.0  )
కారు షెడ్డుకు పోయింది.. ఆఖరికి ఆటో దిక్కయ్యింది.. కేటీఆర్‌పై నెటిజన్ల సెటైర్లు (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఆటోలో ప్రయాణించారు. యూసుఫ్‌గూడ్‌ నుంచి జూబ్లీహిల్స్‌లో తెలంగాణ భవన్‌ వరకు ఇవాళ ఆయన ఆటోలో వెళ్లారు. దీనికి సంబంధిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేటీఆర్ ఆటో లో ప్రయాణిచడంపై నెటిజన్లు పలువురు విమర్శిస్తున్నారు. మరి కొందరు నెటిజన్లు అభినందిస్తున్నారు.

‘కారు షెడ్డుకు పోయింది.. ఆఖరికి ఆటో దిక్కయ్యింది’ అని విమర్శించారు. మరోవైపు ‘ప్రజల కోసం తెలంగాణా కోసం ఎంత సాహసమైన చేయగలడు కేటీఆర్’ అని అభినందించారు. ‘కాన్వాయ్ నుంచి సింగిల్ కారు, ఇప్పుడు కారు నుంచి ఆటో.. కేటీఆర్‌ను గత పదేళ్లలో ఆటో ఎక్కడము ఎన్నడు చూడలేదు’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story