పల్లెల్లో ఎన్నికల సందడి.. BRSకు షాక్ ఇచ్చేలా సర్పంచ్‌ల స్కెచ్!

by Sathputhe Rajesh |
పల్లెల్లో ఎన్నికల సందడి.. BRSకు షాక్ ఇచ్చేలా సర్పంచ్‌ల స్కెచ్!
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగిసింది. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. జనవరి లేదా ఫిబ్రవరిలో సర్పంచ్ ఎలక్షన్లు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ తొందరలోనే విడుదల కానుంది. ఈ మేరకు సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్లపై వివరాలను పంపించాలని జిల్లా అధికారులను స్టేట్ ఎలక్షన్ కమిషన్ కోరింది.

సర్పంచ్, గ్రామ వార్డు మెంబర్ల రిజర్వేషన్లపై వివరాలను గ్రామ కార్యదర్శులు ఎలక్షన్ కమిషన్‌కు పంపిం చారు. గ్రామ పంచాయతీల పదవీ కాలం ముగియడంతో ఎన్నికల కసరత్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలోని గ్రామాల్లో ఎన్నికల సందడి షురువైంది. వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తే మంచిదని నేతల్లో చర్చ మొదలైంది.

అధికార పక్షమా..? ప్రతిపక్షమా..?

జిల్లాలో 61 గ్రామ పంచాయతీలుండగా, 680కి పైగా వార్డులన్నాయి. ప్రస్తుతం మెజారిటీ సర్పంచ్‌లు, వార్డు సభ్యులంతా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి తిరిగి రెండో సారి విజయం సాధించారు. కాగా రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు 2019లో ఎన్నికలు జరిగాయి. వాటి పదవీ కాలం 2024, ఫిబ్రవరి 1వ తేదీతో ముగియనుంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీయే అత్యధిక స్థానాలు గెలుచుకుంటుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సర్పంచ్‌లు, వార్డు సభ్యులలో అంతర్మథనం మొదలైంది. బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుదామా...? లేదా అధికార కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లదామా..? అనే ఆలోచనలో పలువురు సర్పంచ్‌లు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది.

బీఆర్ఎస్ పాలనలో వేధింపులే..

బీఆర్ఎస్ సర్కార్ హాయంలో సర్పంచ్‌లు తీవ్ర ఇబ్బందులు ప డ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు నేరుగా వచ్చే నిధులివ్వకుండా రాష్ట్ర ఖజనాకు మళ్లీంచారు. గ్రామాల్లో చేసిన అభివృద్ది పనులకు కూడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేదు. దీంతో రాష్ట్రంలోని పలువురు సర్పంచ్‌లు ఆర్థిక భారం భరించలేక ఆత్మహత్య కూడా చేసుకున్నారు. కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులు తప్ప, గ్రామాలకు కేసీఆర్ సర్కార్ నిధులు ఇవ్వకుండా వేధించిందని పలువురు సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు అధికార పార్టీకి చెందిన ఏడుగురు సర్పంచ్‌లు సస్పెన్షన్‌కు గురయ్యారు.

మంత్రిగా ఉన్నప్పుడే తమకు అపద వస్తే మల్లారెడ్డి కాపాడలేకపోయారని, ఇక ప్రతి పక్ష ఎమ్మెల్యే హోదాలో మాకు ఇబ్బందులు ఏర్పడితే మల్లారెడ్డి కాపాడుతారా? అని మదన పడుతున్నారు. రిజర్వేషన్ల పక్రియ కూడా అధికార పార్టీ చేతులోనే ఉంటుందని. అధికార పార్టీలో ఉన్న నేతలకు అనుకూలంగా రిజర్వేషన్లు కేటాయించుకునే వీలుంటుందని చర్చించుకుంటు‌న్నారు. ప్రతిపక్ష పార్టీ సర్పంచ్లు చేసిన అవినీతి, అక్రమాలపై విచారణ చేపట్టి దోషులుగా తేల్చే అవకాశం ఉంటుందని, ఈ నేప థ్యంలో అధికార కాంగ్రెస్ గూటికి చేరితే మేలని జిల్లాలోని పలు వురు సర్పంచ్‌లు పెద్ద నాయకులతో టచ్‌లోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed