టీపీసీసీ వార్ రూమ్‌కు నూతన కో-ఇన్ చార్జ్.. ఆదేశాలు జారీ చేసిన థాక్రే

by Satheesh |   ( Updated:2023-11-06 07:37:52.0  )
టీపీసీసీ వార్ రూమ్‌కు నూతన కో-ఇన్ చార్జ్.. ఆదేశాలు జారీ చేసిన థాక్రే
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో అధికారంలోకి రావడమే టార్గెట్‌గా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ అందుకోసం ఎలక్షన్ స్ట్రాటజీలో పక్కా వ్యూహాన్ని అమలు చేస్తున్నది. అభ్యర్థుల ఎంపిక మొదలు ప్రచార పర్వం వరకు గతానికి భిన్నంగా ముందుకు సాగుతున్నది. బీఆర్ఎస్, బీజేపీ వ్యూహాలకు ధీటుగా ప్రతివ్యూహాలు సిద్ధం చేస్తున్న ఏఐసీసీ నేతలు తాజాగా టీపీసీసీ వార్ రూమ్‌కు కో-ఇన్ చార్జిని నియమించారు. ఈ మేరకు సంతోష్ కుమార్ రుద్రను కో-ఇన్ చార్జిగా నియమిస్తూ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్ రావు థాక్రే ప్రకటన విడుదల చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి మరింత ఎక్కువగా తీసుకుపోవాలని హస్తం నేతలు ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లను మరింత విస్తృతంగా వినియోగించుకుంటోంది.

Advertisement

Next Story

Most Viewed