రాజ్‌భవన్‌లో సంక్రాంతి సంబరాలు.. పరమాన్నం వండిన గవర్నర్

by GSrikanth |
రాజ్‌భవన్‌లో సంక్రాంతి సంబరాలు.. పరమాన్నం వండిన గవర్నర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాజ్‌భవన్‌లో ఇవాళ ఘనంగా సంక్రాంతి సంబారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఇవాళ పలువురు మహిళలు, అధికారులు, సిబ్బందితో కలిసి గవర్నర్ భోగి వేడుకలు జరుపుకున్నారు. ఇందులో భాగంగా భోగి స్పెషల్ వంటకం అయిన స్వీట్ పొంగల్ (పరమాన్నం)ను గవర్నర్ వండారు. ఈ సందర్భంగా అందరికీ సంక్రాంతి, పొంగల్ శుభాకాంక్షలు చెప్పారు.

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఇది వ్యక్తిగతంగా ప్రత్యేకమైన పండుగ అని ఎందుకంటే చిరకాల స్వప్నం అయిన రామ్ మందిర్ నిర్మాణం పూర్తి అవుతున్నట్లు వెల్లడించారు. ఇవాళ శ్రీరాముడిపై హిందీతో పాటు తెలుగు భాషలో ఓ పాటను విడుదల చేయనున్నట్లు గవర్నర్ వెల్లడించారు. ఇది వికసిత భారత్‌ అని, ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నారు.

Advertisement

Next Story