ఆమ్రపాలి హాట్ కామెంట్స్.. జీహెచ్‌ఎంసీని చుట్టుముట్టిన కార్మికులు

by Gantepaka Srikanth |
ఆమ్రపాలి హాట్ కామెంట్స్.. జీహెచ్‌ఎంసీని చుట్టుముట్టిన కార్మికులు
X

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్‌ఎంసీ కార్మికులపై కమిషనర్ ఆమ్రపాలి అనూహ్య వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇంటింటి చెత్త సేకరణలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. అప్పుడప్పుడు స్వయంగా మా ఇంట్లో కూడా చెత్తను సేకరించడం లేదని షాకింగ్స్ కామెంట్స్ చేశారు. దీంతో కమిషనర్ వ్యాఖ్యలపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే శుక్రవారం జీహెచ్‌ఎంసీ కార్యాలయాన్ని ముట్టించారు. నగర నలుమూలల నుంచి భారీగా కార్యాలయానికి చేరుకున్న కార్మికులు తమ నిరసనను తెలియజేశారు. తాజాగా నిరసన చేస్తున్న కార్మికుల వద్దకు ఆమ్రపాలి వెళ్లి మాట్లాడారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కార్మికులకు కించపరిచే ఉద్దేశం తనకు లేదని అన్నారు. జీహెచ్‌ఎంసీలో కార్మికులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. చర్చల అనంతరం కార్మికులు ఆందోళన విరమించారు.

Advertisement

Next Story