Pushpa-2:సంధ్య థియేటర్ ఘటన.. పుష్ప-2 నిర్మాతలకు హైకోర్టులో ఊరట!

by Jakkula Mamatha |   ( Updated:2025-01-02 16:01:27.0  )
Pushpa-2:సంధ్య థియేటర్ ఘటన.. పుష్ప-2 నిర్మాతలకు హైకోర్టులో ఊరట!
X

దిశ,వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), డైరెక్టర్ సుకుమార్(Director Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప-2 ది రూల్’(Pushpa 2) మూవీ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ తొక్కిసలాట ఘటనకు సంబంధించి నమోదైన కేసులో పుష్ప-2 సినిమా నిర్మాతలకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ క్రమంలో యలమంచిలి రవిశంకర్, యెర్నేని నవీన్‌లను అరెస్ట్ చేయరాదని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. తొక్కిసలాటలో ఓ మహిళ మృతి నేపథ్యంలో చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ రవిశంకర్, నవీన్‌లు తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ కె.సుజనా విచారణ చేపట్టి.. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

మొదటగా పిటిషనర్ తరఫు న్యాయవాది(lawyer) ఎన్. నవీన్ కుమార్ వాదనలు వినిపిస్తూ ఈ ఘటనతో పిటిషనర్లకు ఎలాంటి సంబంధం లేదన్నారు. FIRలో పేర్కొన్న అభియోగాలు ఏవీ వారికి వర్తించవన్నారు. హీరో అల్లు అర్జున్ థియేటర్‌కు వస్తున్నట్లు నిర్మాతల కార్యాలయం సిబ్బంది.. థియేటర్(Sandhya Theater) యాజమాన్యం, పోలీసు అధికారులు సమాచారం ఇచ్చారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషనర్లను అరెస్ట్ చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో దర్యాప్తునకు సహకరించాలని పిటిషనర్లకు ఆదేశించారు. ఈ కేసులో అరెస్ట్ అయిన థియేటర్ మేనేజర్ అడ్ల శరత్ చంద్రనాయుడు, అల్లు అర్జున్(Allu Arjun) వ్యక్తిగత సిబ్బంది చెరుకు రమేష్, శ్రీరాములు రాజు బెయిల్ మంజూరు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌లపై విచారణను ఈ నెల 6వ తేదీకి వాయిదా వేశారు.

Read More ....

Allu Aravind: అల్లు అరవింద్‌కు నలుగురు కొడుకులు ఉన్నారా.. నాలుగో కొడుకు ఎక్కడ?


Advertisement

Next Story

Most Viewed