ఆస్ట్రేలియా డిప్యూటీ మేయర్‌గా సంధ్యా రెడ్డి..

by Vinod kumar |
ఆస్ట్రేలియా డిప్యూటీ మేయర్‌గా సంధ్యా రెడ్డి..
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆస్ట్రేలియా డిప్యూటీ మేయర్‌గా సంధ్యారెడ్డి (శాండీరెడ్డి) ఎన్నికయ్యారు. ఈ నెల 5న స్ట్రాత్ ఫీల్డ్ సాధారణ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. స్ట్రాత్‌ఫీల్డ్‌ కౌన్సిల్‌ ఎన్నికలు నిర్వహించగా కౌన్సిలర్ కరెన్ పెన్సబెన్ మేయర్‌గా, తెలంగాణ ఎన్ఆర్ఐ సంధ్యారెడ్డి డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఎన్నికను స్ట్రాత్‌ఫీల్డ్ కౌన్సిల్ ప్రకటించింది. పాతిక వేల ఓటర్లు ఉండగా, హోరాహోరీ పోరాటం, రాజకీయ పార్టీల ప్రాబల్యం, ఉత్కంఠ భరితమైన ఆ స్థానిక పోరులో శాండీ రెడ్డి విజయం సాధించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్థానిక నివాసితులకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు అండగా నిలబడుతనని హామీ ఇచ్చారు. సంధ్యారెడ్డి కి 2020 సంవత్సరానికి స్ట్రాత్‌ఫీల్డ్ సిటిజన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాలో డిప్యూటీ మేయర్‌గా నియమితులైన మొదటి భారతీయ సంతతికి చెందిన మహిళ తెలంగాణకు చెందడం విశేషమన్నారు. అనంతరం సంధ్యారెడ్డి ని అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed