Harish Rao : ఉద్యోగ నియామకాల్లో మళ్లీ అదే తంతు : కాంగ్రెస్ సర్కార్ పై హరీష్ రావు ఫైర్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-11-11 12:28:32.0  )
Harish Rao : ఉద్యోగ నియామకాల్లో మళ్లీ అదే తంతు : కాంగ్రెస్ సర్కార్ పై హరీష్ రావు ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్ : ఉద్యోగ నియామకాలలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) మోసపూరితంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి టి.హరీష్ రావు(Harish Rao) ఎక్స్ వేదికగా విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు నిర్వహించిన ఉద్యోగాలకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వం నియామక పత్రాలు పంచడం పరిపాటిగా పెట్టుకుందని, ఏఎంవీఐ ఉద్యోగాల్లోనూ మళ్లీ అదే తంతు ప్రదర్శించిందని హరీష్ రావు మండిపడ్డారు. ఏఎంవీఐ ఉద్యోగ నోటిఫికేషన్ 2022 డిసెంబర్ 31వ తేదీన కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిందని, 2023జూన్ 28న పరీక్ష నిర్వహించిందని హరీష్ రావు తెలిపారు.

నియమకపత్రాలను మాత్రం 2024నవంబర్ 11న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పంచిందని, ఇది కూడా వేసుకోండి కాంగ్రెస్ ఖాతాలో అని ఎద్దేవా చేశారు. కొత్తగా ఎంపికైన అసిస్టెంట్​ మోటార్​ వెహికిల్​ ఇన్​స్పెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేసిన సందర్భంగా హరీష్ రావు ఈ విమర్శలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed