- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వీవోఏలకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలి: కూనంనేని డిమాండ్
దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామాల్లో చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న వీవోఏ (విలేజ్ ఆర్గనైజడ్ అసిస్టెంట్)కు కనీస వేతనంగా రూ.26 వేలు ఇవ్వాలని, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. వీరికి ఇచ్చే జీతభత్యాలలో కేంద్ర కంట్రిబ్యూషన్ ఉండాలని సాంబశివరావు శనివారం ఒక ప్రకటనలో కోరారు. వీవోఏలు తన డిమాండ్ల సాధనకు గత 20 రోజులుగా సమ్మె చేస్తున్నారని వారి సమస్యలను పరిష్కరించి సమ్మెను విరమింప చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 19 వేల మంది ఉద్యోగులు ఉన్నారని, వీరు డ్వాక్రా గ్రూపులను సమన్వయం చేస్తూ, వారికి లోన్‌లు ఇప్పించి, నెలనెల కట్టేవిధంగా చూడడం, రికార్డు పనులు చేస్తుంటారని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పథకాలనే కాకుండా కేంద్రం ప్రభుత్వ పథకాలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ప్రధానమంత్రి జీవన జ్యోతి లాంటి ప్రభుత్వ పథకాలకు కూడా వీరి సహకారం గ్రామస్థాయిలో ప్రముఖంగా ఉంటుందని, హరితహారంలో భాగంగా విత్తన బంతులు తయారు చేయడం వీరి బాధ్యతన్నారు. రోజు మొత్తం కష్టపడి పనిచేసినా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో వీరికి రూ.130 మాత్రమే దినసరి వేతనం పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి అవసరమైన ఆరోగ్య కార్డులు, ఇన్సురెన్స్, పీఎఫ్ తదితర సౌకర్యాలు కల్పించాలని, వారి సమస్యలను పరిష్కరించి సమ్మెను విరమింప చేయుటకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూనంనేని కోరారు.